ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన ఏపిజీఈఏ 10-04-2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు, హర్షం వ్యక్తం చేస్తూ అమరావతిని రాజధానిగా ఖరారు చేయడంలో భాగస్వామ్యం వహించిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కావలి యూనిట్ ప్రెసిడెంట్ నాగిశెట్టి శ్రీనివాసరావు, సెక్రటరీ బండికోటి చలపతిరావు శుక్రవారం కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేశారు.