కావలి RTC డిపోలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు ఉచిత మినరల్ ఆర్.ఓ ప్లాంట్ ప్రారంభం

కావలి RTC డిపోలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు ఉచిత మినరల్ ఆర్.ఓ ప్లాంట్ ప్రారంభం

- ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, RTC జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం..

- స్వయంగా ఆర్.ఓ నీటిని తాగి నాణ్యతను ప్రశంసించిన ఎమ్మెల్యే..

-  రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలను అభినందించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

-  RTC డిపో పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

కావలి, శుక్రవారం:29

కావలి పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు ఉచిత మినరల్ వాటర్ ఆర్.ఓ వాటర్ ప్లాంట్‌ను కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, RTC జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో కలిసి ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే స్వయంగా ఆర్.ఓ నీటిని తాగి నీటి నాణ్యత అద్భుతంగా ఉందని ప్రశంసించారు. తరువాత అక్కడ ఉన్న ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీటిని అందజేశారు.ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు వచ్చే కావలి ఆర్టీసీ డిపోలో స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం ఎంతో అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ ఆర్.ఓ ప్లాంట్ ద్వారా ప్రయాణికులకు ఆరోగ్యకరమైన తాగునీరు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో కావలి రోటరీ క్లబ్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కావలి రోటరీ క్లబ్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, గారిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.కావలి పట్టణంలో ప్రజలకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలను రోటరీ క్లబ్ విజయవంతంగా నిర్వహిస్తోందని కొనియాడారు.

ప్రజా సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.అనంతరం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చీరలను పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య సిబ్బంది సేవలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో RTC అధికారులు, రోటరీ క్లబ్ సభ్యులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు,మహిళలు, ప్రయాణికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts