సెల్ఫీ పాయింట్ వద్ద సందడి చేసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
కావలి పట్టణంలోని 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండా, ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు బుధవారం సందడి చేశారు.. కావలి ఎమ్మెల్యే ల సరసన తన ఫోటో చూసుకున్న వంటేరు క్రిష్ణారెడ్డి గారిని అభినందించారు.. చారిత్రాత్మక ఘట్టానికి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి గారు పునుకున్నారని మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ప్రసంశించారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారని, ప్రతి ఒక్కరిలో దేశ భక్తి, జాతీయ భావం పెంపొందేలా కృషి చేశారని తెలిపారు.. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం కావలి ప్రజల అదృష్టమని అన్నారు.. ఒక అన్నగా నా సహకారం ఎప్పుడూ ఎమ్మెల్యే కు ఉంటుందని తెలిపారు..