కావలి రూరల్ మండలం ఆనేమడుగులో శ్రీశ్రీశ్రీ నాగూర్ మీరాస్వాముల వారి గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు గారు..

కావలి రూరల్ మండలం ఆనేమడుగులో శ్రీశ్రీశ్రీ నాగూర్ మీరాస్వాముల వారి గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు.. 

విశ్వాసానికి పాత్రులు ముస్లింలు 
- రాజకీయ జీవితానికి నాంది పలికింది ముస్లింలు 
- గంధ మహోత్సవ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి  వెల్లడి 

విశ్వాసానికి పాత్రులు ముస్లింలని, తాను ఎమ్మెల్యేగా గెలవడానికి ముస్లింలు చేసిన కృషి ఎనలేనిదని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు అన్నారు. ఆదివారం రాత్రి కావలి రూరల్ మండలం ఆనేమడుగు గ్రామంలో నాగూర్ మీరా స్వాముల వారి గంధమహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దర్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఆనేమడుగు గ్రామానికి విచ్చేసిన ఆయనకు దర్గా కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న ఈ పండుగలో అన్ని వర్గాల వారు పాల్గొని మీరా స్వాముల వారిని దర్శించి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. తన రాజకీయ జీవితానికి నాంది పలికింది ముస్లింలని తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంలో ఈ దర్గాకు వచ్చి తనను ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా కోరడం  జరిగిందన్నారు. మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా చేశారన్నారు. మీ ఇంటి బిడ్డగా మీ గ్రామాన్ని, నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి, ఈ సమస్య వచ్చిన అంతగా నిలబడటానికి ఎప్పుడూ సిద్ధమని తెలిపారు. మన జన్మ సార్ధకమయ్యేలా, నలుగురు మెచ్చే విధంగా ఉండాలని, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని తెలిపారు. పరిశ్రమల రాక కారణంగా భూములు కోల్పోవలసి వస్తే గ్రామంలోని ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా మీ ముందు నేను నిలబడతానని, సరైన పరిహారం లభించే వరకు పోరాడుతానని, ఉద్యోగాలు లభించేలా చూస్తానని తెలిపారు. గ్రామంలోని ప్రతి కాలనీలో సిసి రోడ్లు సంవత్సరం లోపు నిర్మిస్తానని తెలిపారు.

google+

linkedin