ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ 05-09-2025

 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ 05-09-2025

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారి చేతుల మీదుగా 31 మంది లబ్ధిదారులకు సంబందించిన రూ.18,07,248 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. శుక్రవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీటిని లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన వారు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు మన కార్యాలయం నుండి దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు 902 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, 587 మందికి ఇప్పటివరకు చెక్కులు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. మొత్తం రూ.5,44,41,980 ఇప్పటివరకు అందించడం జరిగిందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ పోతుగంటి అలేఖ్య, టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు..






google+

linkedin

Popular Posts