కావలి మద్దురుపాడు అడవి రాజుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ 01-06-2026

కావలి మద్దురుపాడు అడవి రాజుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ 01-06-2026

- కావలి మద్దురుపాడు అడవి రాజుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

- ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..

- లబ్ధిదారుల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

- అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..

- మున్సిపల్ అధికారులతో కలిసి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

-  గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన ఎమ్మెల్యే..

- అడవి రాజుపాలెం రచ్చబండ వద్ద ప్రజా దర్బార్ నిర్వహణ..

- గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

- ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ

- గ్రామాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

ప్రజల చెంతకు పాలనను చేర్చి, వారి ముఖాల్లో ఆనందాన్ని చూడటమే మన కూటమి ప్రభుత్వ పరమావధి. ఇందులో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గం, మద్దూరుపాడు పరిధిలోని అడవిరాజుపాలెం గ్రామంలో వివిధ అధికారిక కార్యక్రమాల్లో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడం జరిగింది. తెల్లవారుజామునే గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి, అవ్వాతాతలకు, వికలాంగ సోదరులకు నా చేతుల మీదుగా అత్యంత ఆత్మీయంగా 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. పెన్షన్ అందుకని వారు వ్యక్తపరిచిన సంతోషం నాకు కొండంత తృప్తిని ఇచ్చింది. ఇదే సమయంలో వారి జీవన పరిస్థితులను, ఇతర సమస్యలను కూడా స్వయంగా అడిగి తెలుసుకున్నాను. మన గ్రామాలు, పట్టణాలు ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులతో కలిసి అడవిరాజుపాలెంలో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. వీధుల వెంబడి పర్యటించి డ్రైనేజీల నిర్వహణను, చెత్త సేకరణ ప్రక్రియను పరిశీలించి, ఎక్కడా అపరిశుభ్రత లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించాను. అనంతరం గ్రామంలోని రచ్చబండ వద్ద స్థానిక ప్రజలతో కలిసి 'ప్రజా దర్బార్' నిర్వహించాను. గ్రామస్తులంతా ఒకచోట చేరి వారి సమస్యలను, గ్రామానికి కావలసిన మౌలిక వసతుల గురించి నాతో పంచుకోగా... వారి నుండి స్వయంగా అర్జీలను (వినతి పత్రాలను) స్వీకరించడం జరిగింది. అనంతరం గ్రామంలోని రచ్చబండ వద్ద స్థానిక ప్రజలతో కలిసి 'ప్రజా దర్బార్' నిర్వహించాను. గ్రామస్తులంతా ఒకచోట చేరి వారి సమస్యలను, గ్రామానికి కావలసిన మౌలిక వసతుల గురించి నాతో పంచుకోగా... వారి నుండి స్వయంగా అర్జీలను స్వీకరించడం జరిగింది.

google+

linkedin

Popular Posts