టీడీపీ మహిళా నాయకురాలు షేక్ అర్షియా బేగం కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న.. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

టీడీపీ మహిళా నాయకురాలు షేక్ అర్షియా బేగం కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న..ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

కావలి, జూన్ 1:

కావలి పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు షేక్ అర్షియా బేగం కుమార్తె నిశ్చితార్థ వేడుక సోమవారం కావలి పట్టణంలోని లేక్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిశ్చితార్థం చేసుకున్న జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ,వారి దాంపత్య జీవితం ఆనందంగా,సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆనందంలో భాగస్వామ్యమయ్యారు.షేక్ అర్షియా బేగం కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

google+

linkedin

Popular Posts