గాడ్స్ గార్డెన్‌ను ప్రారంభించిన.. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
జలదంకి మండలం జమ్మలపాలెం సమీపంలోని హ్యాపీ హోమ్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గాడ్స్ గార్డెన్‌ను శుక్రవారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా గార్డెన్ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే,ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
గాడ్స్ గార్డెన్ ఏర్పాటులో కృషి చేసిన నిర్వాహకులు పాదర్తి చంద్ర కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం ప్రాంగణంలోని వివిధ విభాగాలను సందర్శించిన ఎమ్మెల్యే, అక్కడ ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాల్లో పాల్గొని కొంతసేపు సరదాగా సెటిల్ గేమ్,కోడింబిల్ల ఆడారు. స్థానికులు,సందర్శకులతో మమేకమై ఆహ్లాదకరంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్,జిల్లా అధికార ప్రతినిధి తటవర్తి రమేష్, టిడిపినాయకులు తిరువీధి ప్రసాద్,స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,గార్డెన్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.