పలువురికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే

 పలువురికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే 


కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి శనివారం పలువురికి నివాళులు అర్పించారు. కావలి పట్టణం ముసునూరు రాఘవేంద్ర కాలనీకి చెందిన పులిమి గోవిందరెడ్డి ఉత్తర క్రియల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే కావలి పట్టణం 9వ వార్డుకు చెందిన పూనూరు రవికుమార్ రెడ్డి అకాల మరణం చెందారన్నా విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి శనివారం వారి నివాసానికి చేరుకొని ఆయన భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

google+

linkedin