ప్రతి విద్యార్థి యస్ ఆర్.. శంకరన్ ను స్పూర్తిగా తీసుకొని చదవండి..

 ప్రతి విద్యార్థి యస్ ఆర్.. శంకరన్ ను స్పూర్తిగా తీసుకొని చదవండి..

విద్యార్థులు ఒక లక్యం తో చదివితే ఉన్నత శిఖరాను అధిరోహించవచ్చు.

యస్ ఆర్.. శంకరన్ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

ప్రతి విద్యార్థి యస్ ఆర్.. శంకరన్ ను స్పూర్తిగా తీసుకొని చదవాలని నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి చెప్పారు...శుక్రవారం కావలి పట్టణంలోని వెంగళరావునగర్ లో ఉన్న ప్రభుత్వ బి. సి. బాలుర వసతి గృహం లో యస్ ఆర్.శంకరన్ రిసోర్స్ సెంటర్  ప్రారంభోత్సవ కార్యక్రమనికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరైయ్యారు..ఈ సందర్భంగా వసతి గృహ అధికారులు ఎమ్మెల్యే 

దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారికి శాలువాలు కప్పి పుష్పగుచ్చములు ఇచ్చి ఘనంగా సన్మానించారు..అనంతరం ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వాలనా చేసి సెంటర్ ను ప్రారంభించారు..శ్రీ మేధా  కరస్పాండెంట్  జానకిరామ్ వితరణ చేసిన పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నులను ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేశారు.హాస్టల్లో ఉన్న  మరుగుదొడ్లకు డోర్లు లేవని వార్డెన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో  ప్రభుత్వంతో పని లేకుండా  తన సొంత నిధులతో డోర్లు నిర్మిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు... అనంతరం ఎమ్మెల్యే  దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

 విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు..ప్రతి విద్యార్థి కూడా తమ తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి ఒక లక్ష్యంతో కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునన్నారు. మీరు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే  మీ తల్లిదండ్రులు గురువులు సంతోషం వ్యక్తం చేస్తారన్నారు.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  నారా లోకేష్ విద్యార్థులకు  అన్ని విధాల టెక్నాలజీ తో కూడిన విద్యను  అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు..తాను కూడా ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని నేలపై కూర్చొని  తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి ఇష్టం తో చదివాను కాబట్టి ఈరోజు కావలి ఎమ్మెల్యేగా సేవ చేసుకుంటున్నాను అన్నారు...ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో  M. రవికుమార్, సహాయ బిసి సహాయసంక్షేమాధికారి, చలపతి రావు HWO,జయరామయ్య HWO, కావలి టిడిపి  గుత్తికొండ కిషోర్, మాజీ మునిసిపల్ చైర్మన్ పోతుగంటి ఆలేఖ్య,26వ ఇంచార్జ్ గంగినేని వెంకటేశ్వర్లు,రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి బాలగురుస్వామి,రాష్ట్ర sc నాయకులు కాకి ప్రసాద్,19వ ఇంచార్జి ఎగూరి చంద్రశేఖర్,టీడీపీ నాయకులు తీరువీధి ప్రసాద్,ఇస్క విక్రమ్ రెడ్డి,ఎ. వెంకటేశ్వర్లు నాయుడు,అలా శ్రీనివాసులు, Sk. బాష, విశ్రాంత వసతి గృహ సంక్షేమాధికారి, K. సుధాకర్, విశ్రాంత సహాయబిసి సంక్షేమాధికారి,తదితరులు పాల్గొన్నారు..

google+

linkedin