కావలి పట్టణం 8వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు మొగల్ రహీం బేగ్ (వైసీపీ మైనారిటీ పట్టణ మాజీ అధ్యక్షులు), మొగల్ షమ్మా రహీం (మాజీ మునిసిపల్ కో-ఆప్షన్ మెంబర్), షేక్ పీర్ మొహమ్మద్ (రూరల్ మండల మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు), షేక్ ఫర్వీన్ జాని (మాజీ జిల్లా మహిళా కమిటీ నాయకురాలు) బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ 9 నెలల పాలనలోనే ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి గారు అద్భుతాలు చేశారని, ఇంటింటికీ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ చేరుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తూ సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు.. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కావలి అభివృద్ధి చెందుతుందని తెలిపారు..
Home
- KAVALI MLA
- కావలి పట్టణం 8వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు