దామిశెట్టి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
కావలి డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ దామిశెట్టి శ్రీనివాస నాయుడు ఉత్తరక్రియల కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి తో కలిసి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర బుధవారం పాల్గొన్నారు. శ్రీనివాస నాయుడు చిటపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు పొట్లూరి శ్రీనివాసులు, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు