నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఆదివారం పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.. కావలి పట్టణం 23వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వనేర్ధిని వెంకటేశ్వర్లు నాయుడు - మంజుల దంపతుల కుమారుడు వంశీ చౌదరి వివాహం జమ్మలపాలెం ఎస్వీఆర్ గార్డెన్స్ లో జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే కావలి పట్టణానికి చెందిన ప్రత్తి కొండలరావు - పద్మ దంపతుల కుమారుడు మధు కిరణ్ వివాహం కావలి పట్టణంలోని బృందావనం కాలనీ కళ్యాణ మండపం లో జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.