పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 16-05-2025
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి బుధవారం పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నెల్లూరు గోమతి నగర్ కు చెందిన బట్టేపాటి శ్రీనివాసులు రెడ్డి - శ్రీలత దంపతుల కుమారుడు హశ్వంత్ రెడ్డి వివాహం నెల్లూరులోని పావని గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముసునూరు కు చెందిన పోతిపోక పుల్లయ్య - జయమ్మ దంపతుల కుమారుడు రమేష్ వివాహం బోగోలు మండలం కొండ బిట్రగుంటలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. జువ్వలదిన్నెకు చెందిన బెల్లంకొండ శీనయ్య - శ్రీదేవి దంపతుల కుమారుడు వంశీ వివాహం కొండ బిట్రగుంటలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కావలి, బోగోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు