కావలి కాలువ ఉప కాలువ ఎస్విపిఎం మేజర్ డిస్టిబ్యూటరీ కాలువకు రెండవ పంటకు నీటి విడుదల
కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారి అదేశాలతో
మాజీ సోమశిల ప్రాజెక్టు చైర్మన్
కండ్ల గుంట.మదు బాబు నాయుడు, నీటి సంఘం అధ్యక్షులు చేతుల మీద నీటి విడుదల
కావలి కాలువ 30 కిమీ వద్ద ఎస్విపిఎం కాలువకు 180 క్యూసెక్ ల నీరు విడుదల చేశారు
ఈ సందర్భంగా మదుబాబు నాయుడు మాట్లాడుతూ కావలి ఎంఎల్ఏ కావ్య క్రిష్ణా రెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిచిన మొదటి ఏడాదే రెండవ పంటకు నీరు ఇవ్వడం చరిత్ర అని అన్నారు.
కావలి కాలువ 7 సంవత్సరాలుగా పూడికతీయక నీరు చివరి వరకు రావడం కష్టతరం గా ఉండేదని, ఎంఎల్ఏ కావ్య క్రిష్ణారెడ్డి గారి సహకారం తో కాలువ పని పూర్తి చేసుకొని కావలి కాలువ, అన్ని సబ్ కాలువలకు నీటి విడుదల చేయడం పట్ల ఎంఎల్ఏ గారికి అభినందనలు తెలుపుతున్నామన్నారు.
నీటి సంఘం అధ్యక్షులు, రైతు నాయకులు మాట్లాడుతూ
ఎంఎల్ఏ కావ్య క్రిష్ణా రెడ్డి గారికి అభినందనలు, కృతజ్ఞత లు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో డిఈ లు సత్య ప్రసాద్, శరత్ కుమార్ నిటిసంఘం అధ్యక్షులు యర్రం వెంకటేశ్వర్లు రెడ్డి, కృష్ణా రెడ్డి, రమణయ్య, శ్రీహరి, వెంకటేశ్వర్లు, రమేష్ రెడ్డి, చిన్న రైతు నాయకులు, ఏఈ లు నాగార్జున, మాధవ రావు, గిరి కుమార్ పాల్గొన్నారు..