పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణం గాయత్రి నగర్ కు చెందిన బూచి వెంకట్రావు- రాజేశ్వరి దంపతుల కుమార్తె గ్రీష్మ ప్రియ వివాహం కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే కావలి పట్టణానికి చెందిన తుమ్మల కోటారెడ్డి మనవరాలు నామకరణ మరియు భారసాల కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు..