ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ 24-06-2025

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ 24-06-2025

కావలి ఎమ్మెల్యే దగుమాటి క్రిష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు మాట్లాడుతూ 33 మంది లబ్ధిదారులకు రూ. 32,29,298 చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అత్యవసర వైద్య ఖర్చులు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సల కోసం ఎదురవుతున్న ఆర్థిక బాధలను తీరుస్తూ, ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయనిధి ద్వారా ఇప్పటివరకు కావలి నియోజకవర్గంలో రూ. 4,36,63,040 చెక్కులను పంపిణీ చేయడం విశేషమని తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే గారి మార్గదర్శనంలో, టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యంగా దరఖాస్తు చేసిన నెల రోజుల్లోనే చెక్కులు అందజేయడం టీడీపీ ప్రభుత్వ తక్షణ స్పందనకు నిదర్శనమన్నారు. చెక్కుల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచిన ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి గారి విశేష సహకారం అభినందనీయమన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి పునఃప్రారంభానికి కావలి నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, బోగోలు మండల టిడిపి అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, చిలకపాటి వెంకటేశ్వర్లు, కావలి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, కండ్లగుంట మధుబాబు నాయుడు, పొట్లూరి శ్రీనివాసులు, అర్షియా బేగం, బిజెపి నాయకులు కుట్టుబోయిన బ్రహ్మానందం, మంద కిరణ్, జనసేన కావలి పట్టణ అధ్యక్షులు పొబ్బా సాయి విఠల్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..


google+

linkedin