7 లక్షల LOC సీఎం సహాయనిధి ద్వారా అందించిన.. కావలి శాసనసభ్యులు,దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

 7 లక్షల LOC సీఎం సహాయనిధి ద్వారా అందించిన..కావలి శాసనసభ్యులు,దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..

రెండు రోజులు వ్యవధిలోనే 7 లక్షల LOC సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు తెప్పించి ఆపరేషన్ చేయించునున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి..

ఈరోజు గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటక్రిష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కార్యాలయం నందు ముగ్గురు లబ్ధిదారులకు ఏడు లక్షల రూపాయల LOC ని లబ్ధిదారులకు అందించడం జరిగింది..

కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారి చొరవతో మరోసారి మానవత్వం ప్రత్యక్షమైంది..!

 నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం..సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కేవలం రెండు రోజుల్లోనే ఏడు లక్షల రూపాయల LOC మంజూరు చేయించి, ముగ్గురు నిరుపేదలకు వెలకట్టలేని సాయం అందించారు కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటక్రిష్ణారెడ్డి గారు.ఈరోజు, టిడిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో…బోగోలు మండలంలోని జక్కేపల్లి గూడూరు గ్రామానికి చెందిన శ్రీమతి దావులూరి ఉమాదేవి గారికి ఒక లక్ష రూపాయలు, దగదర్తి మండలంలోని తడకలూరు గ్రామానికి చెందిన శ్రీ పేట శివరామయ్య గారికి మూడు లక్షల యాభై వేల రూపాయలు, కావలి పట్టణానికి చెందిన శ్రీమతి తాడిపత్రి రాధిక గారికి రెండు లక్షల యాభై వేల రూపాయల LOCలను అధికారికంగా అందజేశారు.ఈ ముగ్గురు లబ్ధిదారులూ పేద కుటుంబాలకు చెందినవారు. అత్యవసర వైద్యం కోసం ఖర్చు చేయగల సామర్థ్యం లేని ఈ సమయంలో… తమ బాధను మేనలుగురిలా ఆలకించిన ఎమ్మెల్యే గారు, వెంటనే స్పందించి సీఎం సహాయనిధికి దరఖాస్తు చేయించి, తక్కువ సమయంలోనే నిధులు మంజూరు అయ్యేలా చేశారు.అంతేకాకుండా, లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వైద్యులతో మాట్లాడి ఆపరేషన్లు విజయవంతంగా జరిగేలా చూసేందుకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి మరియు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఇది కేవలం ఓ సహాయం కాదు…ఇది ఓ జీవితం. ఓ ఆశ. ఓ మానవత్వపు ప్రతీక




google+

linkedin