డాక్టర్ ప్రభాకర్ నాయుడును పరామర్శించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

 డాక్టర్ ప్రభాకర్ నాయుడును పరామర్శించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందిన అనంతరం కావలి పట్టణం 12వ వార్డు, సాయిబాబా గుడి సమీపంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారిని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు స్వయంగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే గారు, ఆయన త్వరగా పూర్తిగా కోలుకొని మళ్లీ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి సేవలు అమూల్యమైనవని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రశంసించారు.

“మీ సేవలు కావలి ప్రజలకు ఎంతో అవసరం. త్వరగా కోలుకొని మళ్లీ పాత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలి” అని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ధైర్యం చెప్పారు.ఎమ్మెల్యే గారి ఆత్మీయ పరామర్శతో డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు భావోద్వేగానికి లోనయ్యారు. తమ నివాసానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి ఘనంగా సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా, ఒక కుటుంబ సభ్యుడిలా వచ్చి పరామర్శించడం తనకు ఎంతో ధైర్యాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు..






google+

linkedin

Popular Posts