రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు 20-03-2026
కావలి నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని భక్తి, నియమ నిష్ఠలతో పాటిస్తూ ఉపవాస దీక్షలు నిర్వహించి, చివరి రోజున అల్లా సన్నిధిలో ప్రార్థనలు చేసి పర్వదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం మానవత్వం, సహనం, దానధర్మాల ప్రాముఖ్యతను గుర్తు చేసే పవిత్ర కాలమని పేర్కొన్నారు. ఈ పవిత్ర మాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రతి ముస్లిం సోదరుడు అల్లా ఆశీస్సులతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అల్లా కృపతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొనాలని, వారి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ప్రార్థించారు. ముఖ్యంగా కావలి నియోజకవర్గ ప్రజలందరూ ఐక్యంగా, సౌభ్రాతృత్వంతో జీవిస్తూ సుఖశాంతులతో ముందుకు సాగాలని కోరుకున్నారు. రంజాన్ పర్వదినం సమాజంలో ప్రేమ, ఐక్యత, పరస్పర గౌరవాన్ని మరింత బలపరచాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.