రాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే 27-03-2026
శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా కావలి పట్టణంలోని జనతాపేట, వెంగలరావు నగర్, అన్నపూర్ణ క్లాత్ మార్కెట్, ముసునూరు బలిజ పాలెం, సత్యనారాయణ స్వామి గుడి లో జరిగిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం పాల్గొన్నారు. సీతాలక్ష్మణ సమేత కోదండ రామ స్వామి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కు స్థానిక ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. కావలి నియోజకవర్గ ప్రజలకు శ్రీ రాముని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తటవర్తి రమేష్, రాష్ట్ర ఆర్యవైశ్య కోర్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు, జనసేన నాయకులు ఆలా శ్రీనాద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.