కావలిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి...

 కావలిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి...

44వ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న  కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..

 కావలి, ఆదివారం-29

నెల్లూరు జిల్లా,కావలి పట్టణంలోని బృందావనం కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారికి పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.అనంతరం టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు అన్న ఎన్టీఆర్ అభిమానులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళులు అర్పించారు. పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

google+

linkedin

Popular Posts