రెండు ఎల్‌వోసి పత్రాలు అందజేసిన కావలి ఎమ్మెల్యే 27-03-2026
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రెండు ఎల్‌వోసి పత్రాలను శుక్రవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం గ్రామానికి చెందిన చాపల రుక్మిణమ్మకు రూ.1,74,809, తుమ్మలపెంట గ్రామానికి చెందిన అప్పాడి శ్రీనుకు రూ.60,000 విలువైన ఎల్‌వోసి పత్రాలను ఎమ్మెల్యే స్వయంగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ వైద్య చికిత్సలకు దూరం కావలసిన పరిస్థితి, అప్పులు చేయాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అండగా నిలుస్తోందన్నారు. అవసరమైన వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాధితులు తమ సమస్యలను నా దృష్టికి తీసుకురాగా, వారి పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫార్సు చేయడం ద్వారా ఈ ఆర్థిక సహాయం మంజూరైందని తెలిపారు. వైద్య ఖర్చులకు అవసరమైన ముందస్తు సహాయం లభించడంతో బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Popular Posts
Search This Website
CATEGORIES
Month Wise
- August (29)
- July (34)
- June (12)
- May (14)
- April (37)
- March (25)
- February (12)
- January (3)
- December (23)
- November (42)
- October (18)
- September (19)
- August (51)
- July (53)
- June (62)
- May (54)
- April (51)
- March (23)
- February (41)
- January (53)
- December (32)
- November (7)
- October (36)
- September (47)
- August (47)