రాజువారి చింతలపాలెంలో భక్తిశ్రద్ధలతో మహా మృత్యుంజయ యాగం..
ముఖ్యఅతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..
శ్రీశ్రీశ్రీ విజయ దుర్గ ఆస్థానపీఠంలో శ్రీ పత్రి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా,కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెం గ్రామంలో దైవ సన్నిధిలో మాఘ పౌర్ణమి సందర్భంగా మహా మృత్యుంజయ యాగం భక్తుల మధ్య ఆదివారం ఘనంగా జరిగింది. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ పవిత్ర యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిహాజరయ్యారు. కార్యక్రమ స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే గారికి శ్రీశ్రీశ్రీ విజయ దుర్గ ఆస్థాన పీఠం వ్యవస్థాపకులు శ్రీ పత్రి బ్రహ్మయ్య స్వామి,ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే గారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే గారు కావలి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని దేవిని ప్రార్థించారు. తదుపరి మహా మృత్యుంజయ యాగంలో పాల్గొని హోమ కుండంలో ఆహుతులు సమర్పిస్తూ పూజా కార్యక్రమాల్లో భాగమయ్యారు. వేద మంత్రోచ్చారణలు, శివ నామస్మరణలతో యాగశాల ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ,“ప్రజల శ్రేయస్సు కోసం ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయం. సమాజంలో శాంతి, ఆరోగ్యం,ఐక్యత కోసం మహా మృత్యుంజయ యాగం వంటి కార్యక్రమాలు ఎంతో అవసరం” అని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం సేవాభావంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ పత్రి బ్రహ్మయ్య స్వామిని ఎమ్మెల్యే గారు హృదయపూర్వకంగా అభినందించారు.మహా మృత్యుంజయ యాగం ప్రాముఖ్యతను వివరిస్తూ,ఇది శివుడి కృపను ప్రసాదించే అత్యంత శక్తివంతమైన యాగమని, మనుషులను రోగాలు, అపాయాలు, కష్టాల నుంచి రక్షించి ఆయుష్షు, శాంతి, సుఖసంతోషాలు ప్రసాదిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.ప్రజలందరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి మంచి విలువలతో జీవించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని యాగాన్ని విజయవంతంగా నిర్వహించారు.