కావలిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి - వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి MLA

కావలిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి - వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

 కావలి, ఆదివారం-29

తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అని నినదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచింది. టీడీపీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో అణగారిన, బడుగు,బలహీనవర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చింది. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని. ప్రపంచంలో తెలుగువారిని నెం.1గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవటం సంతోషకరమని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు..నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి జెండా ఎగరవేశారు,పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జెండా ఎగరవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.. అనంతరం బృందావనం కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు అన్న ఎన్టీఆర్ అభిమానులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళులు అర్పించారు. పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పార్టీ కార్యకర్తల్లో శ్రమించి పనిచేసిన వారిని సన్మానించారు. శాలువా కప్పి ఆయా రంగంలో పనిచేసిన వారిని ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, నీతి నిజాయితీకి, నిబద్దతకు మారు పేరు అని, అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో మనమందరం పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. సిద్ధాంతం నిబద్ధతతో కూడిన పార్టీగా భావిస్తూ క్రమశిక్షణగా ఎదగాలన్నారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికీ జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. అత్యంత ఎక్కువ సభ్యత్వాలు కలిగిన, ఖ్యాతి కలిగిన, గొప్పగా చెప్పుకునే పార్టీగా టిడిపి ఎదిగిందని, రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడే పార్టీగా నిలిచిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆధ్వర్యంలో మనమంతా పనిచేయడం అదృష్టం అన్నారు. 74 సంవత్సరాల చంద్రబాబు నాయుడు విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉంటే, మనమందరం ఎంతగా  కష్టపడాలో ఆలోచించాలన్నారు. గత ఐదు సంవత్సరాల్లో రాక్షస పాలనను ఎదుర్కొని రాబోయే తరాల వారికి యువ నాయకుడు లోకేష్ మాదిరిగా మారబోతున్నారన్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో ఎంతగానో కృషి చేస్తున్నారని, అలాగే పార్టీ కార్యకర్తలు, నాయకులు వారి వారి గ్రామాల్లో శ్రమపడి నిబద్ధతతో పనిచేసి మన బిడ్డల భవిష్యత్ తరాల కోసం పాటుపడాలన్నారు. కార్యకర్తలు అందరూ చిన్నచిన్న పొరపాట్లకు అపార్థం చేసుకోవద్దు అన్నారు. రాజకీయాలలో హత్యలు ఉండవు అని, ఆత్మహత్యలే ఉంటాయన్నారు. స్వయంకృపరాధమే మన జీవితానికి ఓటమిపాలు చేస్తుందన్నారు. పెద్దల సూచనలు పాటిస్తూ అడుగులు వేయాలన్నారు. ఎప్పుడు కూడా పార్టీ శాశ్వతం అన్నారు. అంతేకానీ నాయకులు వస్తారు, పోతారు అన్నారు. అరచేతితో సూర్యబింబాన్ని ఆపలేము అని తెలిపారు. పార్టీ కేడర్ లో విభేదాలు లేకపోవు అని, ప్రతి కుటుంబంలో, గ్రామంలో, పట్టణంలో విభేదాలు ఆనేవి ఉంటాయ

ని, సరిచేసుకుంటూ వెళ్లడమే నాయకత్వ లక్షణం అన్నారు. నన్ను ఇబ్బందులు పెట్టినా నేను తలవంచుకొని పోతున్నానే తప్ప, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదు అన్నారు. నాపై అనేక రాళ్లు వేసిన, ఆ రాళ్ళను ఆనకట్టగా వేస్తూ కావలి అభివృద్ధిని ఏమాత్రం ఆగనీయకుండా ముందుకు తీసుకుపోతున్నానన్నారు. కావలి నియోజకవర్గం తనను ప్రజలకు పెద్దన్నగా ఉంచారని, ఆ బాధ్యతను నెరవేరుస్తానన్నారు. ఎమ్మెల్యే ప్రజలందరికీ ఒకే విధంగా పని చేస్తారని, ప్రజల మనిషిని అన్నారు. రేపటి గెలుపు కోసం ప్రతి ఒక్కరు నిబద్దతతో పనిచేసి నిలవాలన్నారు. రిజర్వేషన్ల ప్రకారం పార్టీ పదవులు వస్తాయి తప్ప మన సొంత నిర్ణయాలు పని చేయవు ఆ. అన్ని పదవులు ఒకరికే రావు అని, అలాగే పనులు అన్నీ కూడా ఒకరికే రావు అని, సంపద అంతా ఒకరికే రావాలనుకోవడం సరైన విధానం కాదన్నారు. నేను ప్రసాదం లాంటి వాడనని, వెంకటేశ్వర స్వామి ప్రసాదమును అన్నారు. ఆ ప్రసాదాన్ని ఒక్కడినే తింటే అది స్వార్థం అవుతుందని, అందరికీ పంచి పెడితే అది ప్రసాదమవుతుందన్నారు. నాయకులు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటాను, కనుక సంయమనం పాటించి సహకరిస్తూ తన సమయాన్ని కూడా వృధా చేయకుండా తనకు సహకరించాలి అన్నారు.  ఇతరులకు అవకాశం దొరికే విధంగా ఉండాలన్నారు. ప్రజా ధర్బార్ సమయంలో ప్రజలకు అవకాశం ఇద్దాం అన్నారు. కావలి నియోజకవర్గం టిడిపి పార్టీకి అడ్డాగా మారుస్తానని..కావలికి రేపు ఎలాంటి రిజర్వేషన్ వస్తుందో తెలియదు, కనుక కావలి మన సొత్తు కాదన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

google+

linkedin

Popular Posts