అల్లూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..
కావలి/అల్లూరు, గురువారం:02
కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి నెల్లూరు జిల్లా,అల్లూరు మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని బాధిత కుటుంబాలను పరామర్శించారు.అల్లూరు పట్టణంలో మారం రెడ్డి వెంకారెడ్డి తల్లి సుబ్బమ్మ పెద్దకర్మ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.అలాగే అల్లూరు మండలం తూర్పు గోగులపల్లి గ్రామానికి చెందిన ఆరం ప్రభాకర్ తల్లి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం గ్రామానికి వెళ్లి పార్ధివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. అనంతరం అల్లూరు మండలం పురిని గ్రామం తుఫాన్ నగర్‌కు చెందిన టిడిపి కార్యకర్త తిరుమూరు చిన్న రమణయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారంవారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.