రాజధానిగా అమరావతి.. కావలిలో అంబరాన్నంటిన సంబరాలు
కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించి సంబరాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..
కావలి, గురువారం:02
అమరావతి రాజధాని బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన సందర్భంగా నెల్లూరు జిల్లా, కావలిలో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు.పట్టణంలోని ‘ఐ లవ్ సెల్ఫీ పాయింట్’ వద్ద భారీ ఎత్తున కూడిన తెలుగు తమ్ముళ్లు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా బాణాసంచా పేల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి నాయకులు,అభిమానులకు పంచిపెట్టారు.
అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అడుగు అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రానికి స్థిరమైన రాజధాని అవసరం ఎంతైనా ఉందని, ఈ నిర్ణయం ఆ దిశగా ముందడుగు అని అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరిన రోజు అన్ని అభివర్ణించారు.తెలుగు ప్రజల కలను నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
ఈ వేడుకల్లో భాగంగా ‘ఐ లవ్ సెల్ఫీ పాయింట్’ వద్ద కొవ్వొత్తులు వెలిగిస్తూ మానవహారం ఏర్పాటు చేశారు. యువత, మహిళలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యంగా నిలబడి ఆనందాన్ని పంచుకున్నారు.పార్టీ జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.పండుగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.