చేనేత కార్మికుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు కృషి ప్రశంసనీయం: చేనేత కార్మికులకు ఉచిత కరెంట్ పథకం పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
ప్రజలతో మమేకం అయ్యేందుకు 100 రోజులు 100 గ్రామాలు త్వరలో శ్రీకారం..కావలి ఎమ్మెల్యే..
నియోజకవర్గంలో ప్రతి రైతుకు అండగా ఉంటా..ఎమ్మెల్యే
దగదర్తి మండలం,చెన్నూరు. గురువారం-02
నెల్లూరు జిల్లా, దగదర్తి మండలంలోని చెన్నూరు సచివాలయం వద్ద చేనేత కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకం కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న 36 చేనేత కుటుంబాలకు సంబంధించిన కార్యక్రమంలో కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు, పార్టీ నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చేనేత కార్మికులతో ఆప్యాయంగా మమేకమై, వారి సమస్యలను తెలుసుకున్నారు. చేనేత కార్మికుల జీవన విధానం, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇచ్చారు.చేనేత వృత్తి మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పేర్కొన్నారు. చేనేత కార్మికులు తమ చేతులతో నేసే ప్రతి చీరలో, ప్రతి వస్త్రంలో వారి కష్టం, నైపుణ్యం, కళాత్మకత ప్రతిఫలిస్తుందని అన్నారు. వారు కేవలం కార్మికులు మాత్రమే కాకుండా, దేశ సంపదను సృష్టించే నిజమైన శిల్పులు అని కొనియాడారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 50 సంవత్సరాలకే పెన్షన్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేయడం ఎంతో సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు..ఈ పథకాల ద్వారా చేనేత కుటుంబాలు ఆర్థికంగా బలపడటమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు.చేనేత కార్మికులు తమ కళతో దేశానికి, రాష్ట్రానికి గుర్తింపు తీసుకువస్తున్నారని, వారి కృషి వల్లే మన సంప్రదాయ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరుగుతోందని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ప్రోత్సహించి, వారి వృత్తిని గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా చేనేత కార్మికులు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంట్, పెన్షన్ వంటి పథకాలు తమకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, తమ జీవనోపాధికి ఇది పెద్ద ఊరటగా మారిందని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయనకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై ఎందుకు ఎమ్మెల్యే , త్వరలో నియోజకవర్గంలో “వంద రోజులు – 100 గ్రామాలు” కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి రైతు, ప్రతి కార్మికుడు అభివృద్ధి చెందేలా కృషి చేయడం తన లక్ష్యమని తెలిపారు.చేనేత కార్మికుల పట్ల తనకు ప్రత్యేకమైన అభిమానముందని, వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చేనేత వృత్తి నిలబెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ రంగం అభివృద్ధి చెందితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, చేనేత కార్మికులు, తదితరులు భారీగా పాల్గొన్నారు..