నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
- 20 సంవత్సరాల ముందస్తు ప్రణాళికలతో ఉండటం చంద్రబాబు విజన్
- కడనూతల చెరువు వంద రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం బోగోలు మండలం కడనూతల చెరువు వద్ద వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను ఆయన ప్రారంభించారు. ముందుగా స్థానిక శివాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం జెసిబి కి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటిని భద్రప్రరచడం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కాన్సెప్ట్ అని, నీరు ఉన్న చోట దేవతా మూర్తులు వెలసి ఉంటారని, అలాంటి చోట నగరాలు అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు నమ్మకం అని అన్నారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారని ఆయన అన్నారు. నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఇరిగేషన్, వ్యవసాయం, పంచాయతీరాజ్, అటవీ శాఖలు కలిసి పాల్గొంటాయని, వంద రోజుల కార్యాచరణను నాలుగు దశల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా
ఏప్రిల్ 6–15 పనుల గుర్తింపు,
ఏప్రిల్ 16–20 పరిపాలనా అనుమతులు, ఏప్రిల్ 21–జూలై 9 పనుల అమలు,
జూలై 10–14 నివేదికలు సమర్పణ జరుగుతుందన్నారు. సాగునీటి సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు. చెరువులు, కాల్వలు శుభ్రపరిచే పనులు, కాల్వలు, చెరువులు, చెక్ డ్యాంలను మరమ్మతులు చేసి తొలకరి నీటి నిల్వకు సిద్ధం చేయడం ముఖ్యంగా జరుగుతుందన్నారు. ఫీడర్ ఛానెల్స్ క్లియర్ చేయడం, పూడికలు తొలగించడం, గుర్రపు డెక్క ఆకులను తొలగించడం వంటి పనులు ఈ కార్యక్రమంలో భాగంగా చేపడతామన్నారు. దీంతో వరద ముప్పు తగ్గడంతో పాటు నీటి నిల్వ పెరుగుతుందని తెలిపారు. 20 సంవత్సరాల ముందస్తు ప్రణాళికలతో ఉండే వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. సీపిడబ్ల్యూఎస్ స్కీమ్ కింద బోగోలు మండలంలో నీటి వసతి లేని గ్రామాలకు. నీరు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాశగేశ్వర రావు, నీటి పారుదల శాఖ అధికారులు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు..