రైతాంగం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది - కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి

 రైతాంగం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది 

- 48 గంటల్లో సిఎంఆర్ చెల్లింపులు 

- రెండో పంటకు నీరు సిద్ధం

- రైతు బిడ్డగా మీ పంటలు బాగా పండేలా చూడటం నా బాధ్యత

- కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి 

రైతాంగం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను సిఎంఆర్ ద్వారా విక్రయించిన తర్వాత 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ విధానం రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ, తదుపరి పంటకు సన్నద్ధం కావడానికి తోడ్పడుతుందని ఆయన వివరించారు. రైతులు ప్రస్తుతం పంట కోతలు ముగించుకుని ఆనందంగా ఇంటికి చేరుతున్న ఈ సమయంలో, రెండో పంటకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కావలి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. రాబోయే నెలలో సోమశిల డ్యామ్ నుంచి కావలి కాలువ ద్వారా, అలాగే కనిగిరి రిజర్వాయర్ నుంచి అల్లూరు ప్రాంతానికి నీరు విడుదల చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉంచుకోవద్దని ఎమ్మెల్యే కోరారు. యూరియా కొరతపై వస్తున్న ప్రచారాలు అసత్యమని, అవసరమైన ఎరువులను ఇప్పటికే గోదాముల్లో నిల్వ చేసి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం, తెలుగుదేశం పార్టీ కలిసి బాధ్యత తీసుకున్నాయని చెప్పారు. ఇటీవల కొన్ని వర్గాలు నీటి సరఫరా, ఎరువుల కొరతపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించిన ఆయన, రైతులు అలాంటి అపోహలను నమ్మవద్దని సూచించారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సమయానికి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఐఏబీ సమావేశం నిర్వహించి, సాగునీటి అంశంపై చర్చించి తుది నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. రైతు బిడ్డగా మీ పంటలు బాగా పండేలా చూడటం నా బాధ్యతని తెలిపారు. కావలి ఎమ్మెల్యేగా ఎప్పుడూ మీకు తోడుగా, నీడగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.



google+

linkedin

Popular Posts