క్రీడాకారిణి ని సత్కరించిన కావలి ఎమ్మెల్యే

 క్రీడాకారిణి ని సత్కరించిన కావలి ఎమ్మెల్యే 

ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హర్యానాలోని గురుగ్రామ్ వేదికగా మార్చి 23 నుండి 27 వరకు నిర్వహించిన 7వ మహిళల టీ-10 నేషనల్ క్రికెట్ ఛాంపియన్ షిప్ ఫర్ డెఫ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు అజేయంగా నిలిచి జాతీయ ఛాంపియన్ షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున బరిలోకి దిగిన నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం పల్లిపాడు గ్రామానికి చెందిన బొమ్మల మైదిలి విశేష ప్రతిభ కనబరచింది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి మైదిలి కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసింది. ఎమ్మెల్యే గారు మైదిలి ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అంగవైకల్యాన్ని జయించి, పట్టుదలతో ఆమె కనబరిచిన ప్రతిభ జిల్లా కీర్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని ఎమ్మెల్యే అన్నారు.

google+

linkedin

Popular Posts