విద్యార్థులతో భోజనం చేసి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి –
దగదర్తి, గురువారం-02
నెల్లూరు జిల్లా,దగదర్తి మండలం చెన్నూరు పంచాయతీ కట్టుబడిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే గ విద్యార్థినీ విద్యార్థులు,ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు.ముందుగా పాఠశాల ప్రాంగణంలో ఉన్న సరస్వతి దేవి విగ్రహానికి ఎమ్మెల్యే గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలోని వివిధ విభాగాలను పరిశీలిస్తూ, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై అధికారులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.ప్రత్యేకంగా మధ్యాహ్న భోజన పథకం అమలుపై దృష్టి సారించిన ఎమ్మెల్యే గారు, విద్యార్థులకు అన్నం వండే గదిని సందర్శించి భోజన నాణ్యతను పరిశీలించారు.
వంటశాలలో పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇంకా మెరుగులు దిద్దాల్సిన అంశాలపై సూచనలు చేశారు.తరువాత విద్యార్థులతో మమేకమై, వారికి అందుతున్న భోజనం గురించి నేరుగా అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యంగా ఉందని విద్యార్థులు తెలియజేయగా, ఎమ్మెల్యే గారు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం చేసి, వారికి మరింత ఆత్మీయతను కల్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పాఠశాలలో విద్యార్థులు అద్భుతంగా చదువుతున్నారని ప్రశంసించారు.
విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి ఆశీస్సులు అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తు మెరుగ్గా ఉండాలని, వారికి అవసరమైన అన్ని వసతులు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.విద్యార్థుల రాకపోకల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే విద్యా సంవత్సరంనుంచి బస్సు సదుపాయం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఈ హామీపై విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించేందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే గారు తెలిపారు. విద్య, ఆరోగ్యం రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.