మహాలక్షమ్మ అమ్మవారి ఉత్సవాలులో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న..ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..
దగదర్తి మండలం, ఆదివారం 05.04.2026
నెల్లూరు జిల్లా,దగదర్తి మండలం అనంతవరం గ్రామంలో నిర్వహిస్తున్న మహాలక్షమ్మ అమ్మవారి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి హాజరై కార్యక్రమాన్ని మరింత వైభవంగా మార్చారు.గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఉత్సవ కమిటీ సభ్యులు, టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షుడు పొడమేకల కొండయ్య, గ్రామ పెద్దలు, కూటమి నేతలు ప్రజలు ఘన స్వాగతం పలికారు.శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే ఆలయానికి వెళ్లి మహాలక్షమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. పూజల అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే, నియోజకవర్గ ప్రజలందరికీ సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల్లో ఇలాంటి ఉత్సవాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలుగా నిలుస్తూ ప్రజలకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో దగదర్తి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఉత్సవాల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. గ్రామ యువత,మహిళలు ఉత్సవాలను విజయవంతం చేసేందుకు చురుకుగా పాల్గొంటున్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,ఈ కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ రాష్ట్రా కార్యదర్శి &దగదర్తి మండల ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి,నలహరి హరి బాబు,తోకల యలమందయ్య మండల అధ్యక్షులు అల్లం హనుమతురావు మారుబోయిన గోపాల్, పాపన మల్లికార్జున రెడ్డి, జలదంకి శ్రీహరినాయుడు,గోపసాని శ్రీనివాసులు,అశోక్ ఐత మహేశ్వర రావు,మందా శీనయ్య, తదితరులు పాల్గొన్నారు.