మరియమ్మ కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
బోగోలు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన జర్నలిస్ట్ సతీమణి ఎస్. మరియమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు సోమవారం వారి నివాసానికి చేరుకొని ఆమె పార్ధీవ దేహాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల టిడిపి అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి లేల్లపల్లి సుధీర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.