శ్రీరాంపురం(పెద్దపుత్తేడు)హత్య ఘటనపై బాధిత కుటుంబాన్ని పరామర్శించిన..కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.
దగదర్తి,గురువారం-02
నెల్లూరు జిల్లా, దగదర్తి మండలం శ్రీరాంపురం(పెద్దపుత్తేడు)గ్రామానికి చెందిన కుందుర్తి వెంకటేష్‌ను ఇటీవల కొంతమంది వ్యక్తులు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గురువారం మండల పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా వెంకటేష్ నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ కష్టసమయంలో ప్రభుత్వం మరియు తాను వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.వెంకటేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎమ్మెల్యే కోరారు..దోషులను కఠినంగా శిక్షించాలనే విషయంపై ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్తానని చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని.ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయడం కోసం పోలీస్ శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడటంలో అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు..