రాజువారి చింతలపాలెంలో నూతన మసీదు పరిశీలించిన..కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

రాజువారి చింతలపాలెంలో నూతన మసీదు పరిశీలించిన..కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..

నెల్లూరు జిల్లా,కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెం గ్రామంలో ఇటీవల నిర్మించిన నూతన మసీదును కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి గారు గురువారం సందర్శించారు. మసీదు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు ముస్లిం పెద్దలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ఎమ్మెల్యేకు ప్రత్యేక దువా నిర్వహించి నియోజకవర్గ ప్రజ  శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.మసీదు నిర్మాణం మరియు అక్కడి సౌకర్యాలను ఎమ్మెల్యే ముస్లిం పెద్దలతో కలిసి పరిశీలించారు.మసీదు గ్రామంలోని ముస్లిం సోదరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మసీదు అభివృద్ధికి అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, ముస్లిం సోదరులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  

google+

linkedin

Popular Posts