కావలిలో శ్రీ శాలివాహన ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

 కావలిలో శ్రీ శాలివాహన ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

ముఖ్య అతిథిగా పాల్గొన్న కావాలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి..ఎమ్మెల్యే రాకతో స్కూల్ ప్రాంగణం వద్ద  పండగ వాతావరణం..

కావలి, సోమవారం-06 

నెల్లూరు జిల్లా,కావలి పట్టణం వైకుంటపురంలో ఉన్న శ్రీ శాలివాహన ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను మరింత విశిష్టంగా నిలిపారు.ఎమ్మెల్యే రాకతో స్కూల్ ప్రాంగణం పండగ వాతావరణాన్ని తలపించింది. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకోగా, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts