కావలి నుంచి తిరుమలకు జనసేన శ్రీనాథ్ పాదయాత్ర –కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి చేతుల మీదుగా టీషర్ట్ ఆవిష్కరణ..

కావలి నుంచి తిరుమలకు జనసేన శ్రీనాథ్ పాదయాత్ర –కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి చేతుల మీదుగా టీషర్ట్ ఆవిష్కరణ..

 కావలి, శుక్రవారం-03

నెల్లూరు జిల్లా,కావలిలో భక్తి,రాజకీయం కలిసిన ప్రత్యేక దృశ్యం కనిపించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు కావలి కూటమి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు 2024 ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కోరుకుంటూ జనసేన నాయకుడు ఆలా శ్రీనాథ్ కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు. మొక్కు నెరవేరిన సందర్భంగా,కావలి నుంచి తిరుమలకు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు జన సైనికుడు ఆలా శ్రీనాథ్.ఈ పాదయాత్ర రేపు ఉదయం కావలి ముసునూరు ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద నుంచి ఘనంగా ప్రారంభం కానుంది.ఈ సందర్భంగా పాదయాత్రకు సంబంధించిన ప్రత్యేక టీషర్ట్‌ను కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఆవిష్కరించారు.ఆలా శ్రీనాథ్ పాదయాత్ర విజయవంతం కావలని ఎమ్మెల్యే గారు కోరుకున్నారు..ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు,వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా మద్దతు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి  గారిపై అభిమానంతో, భక్తి భావంతో చేపట్టిన ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, పాల్గొనేవారికి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

google+

linkedin

Popular Posts