బోగోలు మండలంలో మహానాడు వేడుకలు ఘనంగా వేడుకలు..
మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..
కావలి, గురువారం:28
కావలి నియోజకవర్గం బోగోలు మండలం ఎంకే ఫంక్షన్ హాల్‌లో క్లస్టర్ 8, 9లకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై ఎంపీ, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు.మహానాడు ప్రాంగణం మొత్తం పసుపు జెండాలు, పార్టీ నాయకుల చిత్రాలతో కళకళలాడింది. కార్యకర్తల నినాదాలతో సభ ప్రాంగణం మారుమోగింది.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర అని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా మహానాడు నిలుస్తుందని అన్నారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. బిట్రగుంట రైల్వే అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు.అలాగే బోగోలు మండలం మంగమూరు గ్రామానికి ఎంపీ నిధుల ద్వారా రూ.25 లక్షల వ్యయంతో మంచినీటి సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించేలా ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, అలాంటి నాయకుడికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని ఎంపీ కోరారు.
అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మహానాడు కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతుండడం ఆనందంగా ఉందన్నారు.మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి కేవలం ఒక సమావేశం మాత్రమే కాదని, పార్టీ ఆవిర్భావ లక్ష్యాలు, ప్రజా సంక్షేమ సిద్ధాంతాలను గుర్తు చేసే మహత్తర వేదిక అని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు.స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తుచేశారు.ప్రజల సంక్షేమమే టిడిపి ప్రధాన సిద్ధాంతమని, పేదలు, రైతులు, మహిళలు, యువత అభివృద్ధే పార్టీ లక్ష్యమని అన్నారు.
మహానాడు ద్వారా పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఎన్నో సంవత్సరాలుగా బిట్రగుంట రైల్వే గేటు సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు శనివారం అధికారులను తీసుకువచ్చి చర్యలు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.. టిడిపి కార్యకర్తలు కొత్త ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.అలాగే అల్లూరు రోడ్డుకు సంబంధించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షులు మాలపాటి నాగేశ్వరరావు క్లస్టర్ ఇంచార్జ్ కోడూరు వెంకటేశ్వర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి చిలక పార్టీ వెంకటేశ్వర్లు, లేలపల్లి సుధీర్ కుమార్ తెలుగు యువత అధ్యక్షులు అన్నంగి ఆదిశేషయ్య ఐటిడీపీ అధ్యక్షులు గోచిపాతల సంజయ్, క్లస్టర్ ఇంచార్జిలు, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..