కావలిలో 48 మంది లబ్ధిదారులకు CM Relief Fund రూ.35.37 లక్షల చెక్కుల పంపిణీ

 - ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

- కావలిలో 48 మంది లబ్ధిదారులకు రూ.35.37 లక్షల చెక్కుల పంపిణీ

మహానాడు తీర్మానాల అమలే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలి : ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

కావలి, శనివారం,మే:30

పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్సలు, ఇతర అవసరాల సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో  ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా 35వ విడతలో 48 మంది లబ్ధిదారులకు రూ.35,37,408 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఇప్పటివరకు కావలి నియోజకవర్గంలో 1,188 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.9,66,47,935 మేర ముఖ్యమంత్రి సహాయనిధి అందజేయడం జరిగిందన్నారు. అవసరమైన సమయంలో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడంలో సీఎంఆర్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.

ఇటీవల మే 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘన విజయవంతమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించి పలు కీలక తీర్మానాలు మహానాడులో ఆమోదించారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించబడిందన్నారు. అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మహానాడును విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మహానాడు విజయవంతానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు,నిర్వాహకులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కావలి నియోజకవర్గంలోని 12 క్లస్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో మహానాడును ఘనంగా నిర్వహించి పార్టీ పట్ల తమ నిబద్ధత, క్రమశిక్షణను చాటుకున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. మహానాడులో ఆమోదించిన తీర్మానాలను ప్రతి కార్యకర్త అధ్యయనం చేసి వాటి అమలుకు కృషి చేయాలని సూచించారు.కావలి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు విషయంలో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే పార్టీ లక్ష్యమని చెప్పారు. వచ్చే మహానాడు నాటికి ఈసారి తీసుకున్న తీర్మానాల అమలులో గణనీయమైన పురోగతి సాధించి పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్‌కు మంచి పేరు తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అదేవిధంగా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ద్వారా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. సహాయం అవసరమైన ప్రతి అర్హుడికి సీఎం రిలీఫ్ ఫండ్ అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి ప్రభుత్వానికి పంపించడం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధిదారులకు సహాయం అందుతోందన్నారు.ముఖ్యమంత్రి సహాయనిధి కోసం అడిగిన వెంటనే స్పందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కావలి నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు,అల్లూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ రెడ్డి,మాజీ సోమశిల చైర్మన్ కండ్లకుంట మధు బాబు నాయుడు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షురాలు కోసూరి ప్రత్యూష, తెలుగుదేశం పార్టీ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..

google+

linkedin

Popular Posts