బోటు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

బోటు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

- మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ..

కావలి, గురువారం:28

నెల్లూరు జిల్లా,బోగోలు మండలం తాటిచెట్లపాలెం సముద్ర తీరంలో జరిగిన విషాద బోటు ప్రమాదం స్థానికులను కలచివేసింది. బుధవారం తెల్లవారుజామున వేటకు వెళ్లిన మత్స్యకారుల తెప్ప సముద్రంలో బోల్తా పడటంతో అలిచర్ల బంగారుపాలెం గ్రామానికి చెందిన తుపిలి బాలమురళి (55), కోమారి గోవింద్ (44) మృతి చెందారు. వారి మృతదేహాలు పాతపాలెం సమీప తీర ప్రాంతంలో లభ్యమయ్యాయి. మరో ఇద్దరు మత్స్యకారులు పోలిసింగారి గణేష్, పోలిసింగారి రాజా గల్లంతుకాగా, వారి కోసం పోలీసులు, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.ఘటన విషయం తెలుసుకున్న కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి వెంటనే కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం గురువారం అలిచర్ల బంగారుపాలెం మృతుల గ్రామాలకు వెళ్లిన ఎమ్మెల్యే, బాధిత కుటుంబాలను పరామర్శించి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ సముద్రంలో తెప్ప బోల్తా పడి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందడం, మరో ఇద్దరు గల్లంతు కావడం అత్యంత విషాదకరమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మృతి చెందిన ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు.

గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు,టిడిపి నాయకులు, మత్స్యకారులు,గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.














google+

linkedin

Popular Posts