అల్లూరు ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ యల్లంటి రాధిక మృతికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాళి..
కావలి, శనివారం:30
కావలి పట్టణం 12వ వార్డుకు చెందిన, అల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న యల్లంటి రాధిక అనారోగ్యంతో మృతి చెందడం పట్ల కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం రాధిక నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యల్లంటి రాధిక ప్రభుత్వ ఉద్యోగిగా తన విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలు అందించారని పేర్కొన్నారు.
ఆమె మృతి కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా సహోద్యోగులకు, పరిచయస్తులకు తీరని లోటని అన్నారు.రాధిక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్యే, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, కాలనీ వాసులు పాల్గొని యల్లంటి రాధికకు నివాళులర్పించారు..