కావలి ఏరియా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ కే. సుబ్బారెడ్డి పదవీ విరమణ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి, శనివారం:30
కావలి పట్టణంలోని ఎస్‌ఆర్ పార్క్‌లో కావలి ఏరియా ఆసుపత్రిలో 27 సంవత్సరాల పాటు సివిల్ సర్జన్ స్పెషలిస్ట్‌గా విశిష్ట సేవలు అందించిన డాక్టర్ కే. సుబ్బారెడ్డి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోటి వైద్యులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ సుబ్బారెడ్డి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి డాక్టర్ సుబ్బారెడ్డిని శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ కే. సుబ్బారెడ్డి గత 27 సంవత్సరాలుగా వైద్య రంగంలో అంకితభావంతో పనిచేస్తూ వేలాది మంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించారని ప్రశంసించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోవడం గొప్ప విషయమని అన్నారు.
వైద్య వృత్తిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ సుబ్బారెడ్డి పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించారు. సమాజానికి ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా తన అనుభవంతో ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు.కార్యక్రమంలో పలువురు వైద్యులు, ప్రముఖులు మాట్లాడుతూ డాక్టర్ సుబ్బారెడ్డి సేవలను గుర్తుచేసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పదవీ విరమణ వేడుకను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.