ఆపదలో అండగా నిలిచిన..కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ఎల్‌ఓసీ ద్వారా రూ.1,52,810 మంజూరు

 - ఆపదలో అండగా నిలిచిన..కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

- తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రేఖ రమేష్‌కు ఎల్‌ఓసీ ద్వారా రూ.1,52,810 మంజూరు

- చెన్నై ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స కోసం ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేత

- ఎమ్మెల్యే కార్యాలయంలో ఎల్‌ఓసీ పత్రం అందజేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.. 

- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం..

ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మరోసారి తన సేవాభావాన్ని నిరూపించారు.కావలి పట్టణంలోని 9వ వార్డుకు చెందిన శ్రీ రేఖ రమేష్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వైద్యుల సూచన మేరకు అత్యవసర చికిత్స అవసరమని తెలియడంతో, చికిత్స ఖర్చులను భరించే ఆర్థిక స్థోమత లేక బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దగుమాటి వెంకటక్రిష్ణారెడ్డిని ఆశ్రయించారు. వారి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ద్వారా రూ.1,52,810 ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు.ఈ సందర్భంగా శుక్రవారం కావలిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి చేతుల మీదుగా ఎల్‌ఓసీ పత్రాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.తమ క్లిష్ట సమయంలో వెంటనే స్పందించి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేసిన  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సకాలంలో చేరేలా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, తదితరులు పాల్గొన్నారు..




google+

linkedin

Popular Posts