వెంగళరావు నగర్లో నివాసం ఉంటున్న ఆటోడ్రైవర్ సుబ్రహ్మణ్యం గారికి ఇటీవల పక్షవాతం రావడంతో ఇంటికే పరిమితం కావడంతో కుటుంబ జీవనం కష్టంగా మారడంతో నేడు సంయుక్త సేవా సంస్థ ద్వారా ఆ సంస్థ సభ్యుల సహకారంతో నేడు కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి చేతులమీదుగా తోపుడు బండిని అందజేయడం జరిగింది.
పై కార్యక్రమంలో కావలి నియోజకవర్గం పి4 కో ఆర్డినేటర్ యంగ్ ప్రొఫిషినల్ గుండెమడుగుల సత్యానందం, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, టిడిపి నాయకులు శానం హరి గారు తదితరులు పాల్గొన్నారు