90 లక్షలతో అల్లూరులో సెంట్రల్ లైటింగ్
- ఈ ప్రాంతవాసులుగా అల్లూరు అభివృద్ధి మా బాధ్యతన్న నేతలు
- అల్లూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభం
- ఎలాంటి ఇబ్బంది ఉన్నా కార్యాలయంలో సంప్రదించండన్న కావలి ఎమ్మెల్యే
- కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర
అల్లూరు మండల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అల్లూరు మండలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఓఎన్ జీసి కంపెనీ సిఎస్ఆర్ నిధులు 90 లక్షలతో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ కు శంకుస్థాపన, ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సొంత నిధులతో నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఓఎన్ జీసి కంపెనీ సిఎస్ఆర్ నిధులతో అల్లూరులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి చేస్తామన్నారు. అల్లూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అల్లూరులో అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి సొంత నిధులు వెచ్చించి టీడీపీ మండల పార్టీ కార్యాలయం నిర్మించడం మంచి పరిణామన్నారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దయతో స్వామివారి కోనేరును నిర్మించే భాగ్యం దక్కిందన్నారు. స్వామి దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యుల బీద మస్తాన్ రావు మాట్లాడుతూ అల్లూరు వాసిగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కంపెనీలు తమ సిఎస్ఆర్ నిధులతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామం అన్నారు. పాఠశాలలో డిజిటల్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సేవ కార్యక్రమాలను కొనియాడారు.
బీద రవిచంద్ర మాట్లాడుతూ అల్లూరు అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగిందన్నారు. గత ఐదేళ్ల కాలంలో ఒక అభివృద్ధి పని ఇక్కడ చేపట్టలేదని చెప్పారు. అల్లూరులో అభివృద్ధి కార్యక్రమాలకు 30 కోట్లు అవసరమని, ఇద్దరు ఎంపీలు దీనిపై దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్న నెల్లూరులో అనేకమంది ఉన్నారని, వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ లైటింగ్ కు కృషి చేస్తున్న ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా సొంత నిధులు వెచ్చించి టిడిపి మండల పార్టీ కార్యాలయం నిర్మించామన్నారు.
ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కార్యాలయంలో సంప్రదించవచ్చని చెప్పారు. అల్లూరు అభివృద్ధిలో భాగంగా 90 లక్షలు నిధులతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనుండడం గొప్ప విషయమని చెప్పారు. ఈ సందర్భంగా ఓఎన్జిసి కంపెనీ వారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు వేమిరెడ్డి కోటారెడ్డి, టిడిపి నాయకులు బండి శ్రీనివాసులు రెడ్డి, పలగాటి శ్రీనివాసులు రెడ్డి, మేడా క్రిష్ణారెడ్డి, బండి అమర్ రెడ్డి, అంబటి రాజేంద్ర, రామిశెట్టి కృష్ణ చైతన్య, బీద గిరిధర్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, సామంతుల పరందామరెడ్డి, గుడి హరిరెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.