2047 నాటికి పేదలందరూ బంగారు కుటుంబాలుగా మారాలి: కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..
నెల్లూరు జిల్లా,కావలి ఆర్డీఓ కార్యాలయంలో P4 మొదటి వార్షికోత్సవం మొదటి వార్షికోత్సవం బంగారు కుటుంబాల లక్ష్యంపై సోమవారం సమావేశం జరిగింది.ఈ సమావేశానికి కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి హాజరై అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి సమగ్రంగా సమావేశం జరిగింది. పేదల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదలపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా సమీక్షించారు. అనంతరం 8 మంది మార్గదర్శకులను ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు దాతలు, సేవాభావం ఉన్న వ్యక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ప్రభుత్వ సంకల్పం సఫలీకృతం కావాలంటే దాతలు ముందుండి సహకరించాలని ఆయన అన్నారు.ప్రభుత్వం పేదల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కట్టుబడి ఉందని, విద్య ద్వారానే వారి భవిష్యత్తు మారుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పేదల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. 2047 నాటికి పేదలందరినీ బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి వర్గం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో స్పష్టం చేశారు..