మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలి

 మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలి

- కావలి పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం 

రాజధాని మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన, అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలని కావలి పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం కోరారు. సోమవారం కావలి డిఎస్పీ శ్రీధర్ ను కలిసి సాక్షి ఛానెల్, అలాగే జర్నలిస్ట్ లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాక్షి న్యూస్ ఛానల్ వేదికగా కే.ఎస్.ఆర్ లైవ్ షో లో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతి మహిళల గౌరవమర్యాదలకు భంగం వాటిల్లేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి మానేజ్ మెంట్ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షి ఛానల్ లో రెచ్చగొట్టే విధంగా ట్రోల్స్ చేయడం, అమరావతిలోని ప్రజలే కాకుండా రాష్ట్రంలోని మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీని వలన మహిళా లోకం అసహనానికి గురైనదని అన్నారు. అమరావతి రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయమై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళలు పాల్గొన్నారు..



google+

linkedin