క్రమశిక్షణతో ముందుకు సాగితేనే విజయం సాధ్యమవుతుంది - కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు

 క్రమశిక్షణతో ముందుకు సాగితేనే విజయం సాధ్యమవుతుంది - కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు 

- ఘనంగా విక్రమ సింహపురి యూనివర్సిటీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు 

విద్యార్థి దశ ముగిసిన తర్వాత జీవితంలో నిజమైన పోరాటం ప్రారంభమవుతుందని, సమస్యలను ఎదుర్కొంటూ క్రమశిక్షణతో ముందుకు సాగితేనే విజయం సాధ్యమవుతుందని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు అన్నారు. కావలి లోని విక్రమ సింహపురి యూనివర్సిటి కళాశాల వార్షికోత్సవ వేడుకలు బుధవారం కళాశాల ఆవరణలో అత్యంత ఘనంగా, ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.హెచ్. శ్రీనివాస్ రావు  అధ్యక్షత వహించగా, వి.యస్.యు వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా, కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు విశిష్ట అతిదిగా, రిజిస్ట్రార్ ఇంచార్జి డాక్టర్ కె. సునీత, గౌరవ అతిధిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ అఫ్ జూవాలజి డాక్టర్ వి. శైలజ వైస్ ప్రెసిడెంట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రుల కష్టాలను గుర్తుంచుకుని వారి ఆశలను నెరవేర్చాలని సూచించారు. జీవితంలో అపజయాలు సహజమని, వాటిని ఎదుర్కొని మళ్లీ ప్రయత్నిస్తే విజయం తప్పక దక్కుతుందని చెప్పారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలతో కృషి చేసి, కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరన్నారు. అలాగే జీవితంలో ప్రొఫెషనల్, ఫ్యామిలీ, సోషల్, ఆధ్యాత్మిక లక్ష్యాలను సమతుల్యం చేయాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, సరైన ఆలోచన విధానం ఉంటే ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగగలరని తెలిపారు.

భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకుని సమాజానికి సేవ చేయాలని విద్యార్థులకు ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు కళాశాల వార్షిక నివేదికను చదువుతూ, గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు, అధ్యాపకులు సాధించిన అకడమిక్, రీసెర్చ్, క్రీడా మరియు ఇతర రంగాల విజయాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి మా కళాశాల కట్టుబడి ఉందన్నారు. జ్ఞానంతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు కలిగి ఉండటం ముఖ్యమన్నారు.కళాశాల అభివృద్ధికి సహకరించిన యాజమాన్యం, అధ్యాపకులకు ధన్యవాదాలని పేర్కొన్నారు. వైస్ ప్రెసిడెంట్ వి. శైలజ కళాశాల విశిష్టతను వివరించారు.  డాక్టర్ ఎం.సుశీల తయారు చేయించిన కళాశాల పత్రిక ని ఈ కార్యక్రమం లో భాగంగా  ఆవిష్కరించారు. వైస్ ఛాన్స్ లర్ అల్లం శ్రీనివాస రావు మాట్లాడుతూ విద్యార్థులు  తమ కళాశాల చదువు పూర్తి అయ్యేలోపు తమ సక్సెస్ కి బాటలు వేసుకోవాలని తమ భవిష్యత్తుని ముందుగా నిర్ణయించుకోవాలని తెలియజేసారు. డాక్టర్ కె. సునీత మాట్లాడుతూ విద్యార్థులు ప్రాజెక్ట్ లో భాగంగా సామాజిక అవసరాలు, ప్రభుత్వ పథకాలు వంటి వాటి మీద కూడా దృష్టి పెడితే బాగుటుందని, ఈ కళాశాల వేడుకలు ఇంకా ముందు కూడా వేడుకగా జరగాలని చెప్పారు. క్రీడా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధాన అతిథి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



google+

linkedin

Popular Posts