ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత 13-04-2026

 ముఖ్యమంత్రి సహాయనిధి  చెక్కులు అందజేత 13-04-2026

కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారి ఆదేశాలతో టీడీపీ నాయకులు సోమవారం పంపిణీ చేశారు. 33వ విడతగా వచ్చిన 43 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 43 మంది లబ్ధిదారులకు  రూ.14,68,230 మంజూరు కావడం జరిగిందన్నారు. ఇప్పటివరకు మొత్తం 1535 మంది దరఖాస్తు చేసుకోగా 1095 మందికి రూ.8,71,84,210 రావడం జరిగిందన్నారు. మరో 440 మంది లబ్ధిదారుల దరఖాస్తులు ప్రాసెస్ లో ఉన్నాయని, వెరిఫికేషన్ అనంతరం వారికి కూడా త్వరలో చెక్కులు అందజేయబడతాయని తెలిపారు.

అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ప్రమాదవశాత్తు మృతి చెందిన నాటకరాని రమణయ్యకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమనిధి కింద రూ.5,00,000 మంజూరు చేయబడిందని తెలిపారు. పార్టీ కార్యకర్తల సంక్షేమనిధికి ఇప్పటివరకు 29 మంది దరఖాస్తు చేసుకోగా 9 మందికి రూ. 45,00,000 జారీ అయ్యాయని,మిగిలిన 20 మంది లబ్ధిదారులకు వారియొక్క నామినీ అకౌంట్ లోకి త్వరలో జమ కాబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఏగూరి చందశేఖర్, కండ్లగుంట మధుబాబు నాయుడు, అర్షియా బేగం, బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, కోడూరు వెంకటేశ్వర్లు రెడ్డి, రేబాల శంకర రెడ్డి, మేడా క్రిష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts